ETV Bharat / state

రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ - జీహెచ్​ఎంసీ 2020 ఎన్నికల వార్తలు

గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నామని తెలిపారు. కమిషనరేట్​ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్​ సెల్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

rachakonda cp about ghmc elections
రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ
author img

By

Published : Nov 19, 2020, 6:56 AM IST

రాచకొండ కమిషరేట్ పరిధిలోని 30 వార్డులకు జరగబోయే ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మొత్తం 628 పోలింగ్ సెంటర్లు ఉండగా.. వాటిలో మొత్తం 1,687 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని సీపీ వివరించారు. కాగా కమిషనరేట్ పరిధిలో 14 లక్షల 18 వేల 938 ఓటర్లు ఉన్నారు.

ప్రత్యేక సెల్​

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందికి తగు సూచనలు చేశామని సీపీ చెప్పారు. రౌడిషీటర్లపై బైండ్ ఓవర్ కేసులు పెట్టామని తెలిపిన ఆయన.. లైసెన్స్​ తుపాకులు ఉన్నవారు స్వచ్ఛందంగా డిపాజిట్ చేయాలని నోటీసులు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. ఎన్నికల దృష్ట్యా కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసామని.. ఈ సెల్​ 24 గంటలు పని చేస్తుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.