ETV Bharat / state

'ఇంటికో ఉద్యోగం అన్నారు... ఊరికొకటి కూడా లేదు'

టీఆర్టీ ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు మద్దతుగా అభ్యర్థులతో కలిసి నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ ముందు ధర్నాలో పాల్గొన్నారు.

r-krishnayya
author img

By

Published : May 6, 2019, 5:52 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో సర్కారు తాత్సారం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య ఆరోపించారు. సుమారు 50వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వుంటే కేవలం 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు నిరసన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఉద్యోగార్థులతో ధర్నాలో పాల్గొన్న ఆర్​ కృష్ణయ్య

ఇదీ చదవండి: 'వచ్చేనెల 11వరకు మద్యం షాపులు మూసేయాలి'

Hyd_Tg_39_06_R.Krishanaiah On Try Candidates_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. టిఆర్టీ ఉపాధ్యాయుల నియామకాలు వెంటనే చేపట్టాలని వేయి మంది అభ్యర్థులు హైదరాబాద్ నాంపల్లి లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికే 4600 పాఠశాలలను మూసివేశారని... దాదాపు 50వేల ఉపాధ్యాయుల పోస్ట్ లు ఖాళీగా వుంటే 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయకపోవడం దారుణమని కృష్ణయ్య విమర్శించారు. కేసీఆర్ చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం కాదు కదా ఉరికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా... తమ కుటుంబ పాలనతో పబ్భం గడుపుతున్నారని మండిపడ్డారు. సెలెక్ట్ అయిన దాదాపు వెయ్యి మంది అభ్యర్థుల కుటుంబాలు ఆత్మభిమానాన్ని చంపుకొని ఆకలికి అల్మటిస్తూ... ఉద్యోగాల కోసం నిరసనలు చేస్తుంటే... ముఖ్యమంత్రి పట్టించుకోకపోడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు ఇవ్వాలని లేదంటే... రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిస్తామని ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బైట్: ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.