ETV Bharat / state

krishnaiah: ఆదర్శ పాఠశాలల గెస్ట్ టీచర్లను పర్మినెంట్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య - జీతాలు చెల్లించాలి

ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఉపాధ్యాయులకు పెండింగ్​ జీతాలు తక్షణమే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గంటల ప్రకారం పనిచేసే వ్యవస్థను తొలగించాలన్నారు. వేతనాలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ముట్టడించింది.

krishnaiah
హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం వద్ద ఆందోళన
author img

By

Published : Sep 14, 2021, 5:56 PM IST

​ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్​ టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న 9 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. టీచర్లను రెన్యూవల్ చేయాలని హైదరాబాద్ బషీర్ బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ముట్టడించింది. టీచర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆయన పాల్గొన్నారు.

గెస్ట్​ టీచర్ల వ్యవస్థను రద్దు చేయాలి

రాష్ట్రంలోని పాఠశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గంటల ప్రకారం పనిచేసే గెస్ట్ టీచర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. రెగ్యులర్​ ఉపాధ్యాయులతో పాటు వీరికి కూడా సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. అవర్లీ బేస్డ్ టీచర్ అనే పదం వారిని అవమానించడమేనని ఈ పదాన్ని తొలగించి కాంట్రాక్టు, ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లు అని మాత్రమే పిలవాలన్నారు.

రాష్ట్రంలో 194 ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 1218 మంది గెస్ట్ టీచర్ల సర్వీసును పునరుద్ధరించాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేశ్ డిమాండ్ చేశారు. కేవలం జీతాలమీదే ఆధారపడి పనిచేస్తున్న వీరి బతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు. వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ గంటల ప్రాతిపాదికన కాకుండా నెల వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. తక్షణమే వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నిరకాల విద్య అర్హతలు ఉండి చదువు చెప్పడానికి గంటల పద్దతిలో ఉపయోగించుకోవడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని నీలం వెంకటేశ్ హెచ్చరించారు.

ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రకారం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెండింగ్​లో ఉన్న 9 నెలల జీతాలు చెల్లించాలి. వీరికి పనికి తగిన వేతనం ఇవ్వాలి. టీచర్లకు ఇతర ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలివ్వాలి. ఉపాధ్యాయుల్లో కేవలం రెండు రకాల టీచర్లే ఉండాలి. రెగ్యులర్, కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలి. గెస్ట్ టీచర్ల వ్యవస్థను తొలగించాలి. ఐదేళ్లుగా ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలి. అదేవిధంగా వీరికి జీతాలు కూడా పెంచాలి.- ఆర్​.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 9 నెలల బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. కేవలం వారం రోజుల్లో ఇస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదు. టీచర్లకు జీతాలు లేకపోతే 70 శాతం పాఠశాలకు వస్తున్న పిల్లలకు చదువు ఎవరు చెప్పాలి. అన్ని అర్హతలు ఉన్న కూడా వారికి జీతాలు పెంచడం లేదు. పెండింగ్​లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. - నీలం వెంకటేశ్, తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్

తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆందోళన

ఇదీ చూడండి: YS Sharmila: కేసీఆర్ స్పందించాలంటే.. ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.