ETV Bharat / state

ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి : ఆర్.కృష్ణయ్య

విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హిమయత్ నగర్​లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యమాలతో సీఎం అయిన కేసీఆర్.. ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే అణచివేయడం సరికాదన్నారు.

author img

By

Published : Dec 16, 2020, 7:03 PM IST

r-krishnaiah-demands-to-government-take-field-assistants-in-duties
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి: ఆర్.కృష్ణయ్య

డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ హిమయత్ నగర్​లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అకారణంగా విధుల నుంచి తొలిగించడం వల్ల మనస్తాపానికి గురై 21 మంది క్షేత్ర సహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్... ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే అణచివేయడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. కార్యాలయం లోపలికి అనుతించకపోవడం వల్ల పోలీసులపై కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ భారంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమను ముఖ్యమంత్రి కేసీఆర్... మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు వేడుకున్నారు.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.