సినిమాల్లో వస్తున్న అశ్లీల దృశ్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. వీటి వల్ల యువత పెడదారిన పడుతున్నారని తెలిపింది. విడుదలకు సిద్ధంగా ఉన్న డిగ్రీ కాలేజ్, ఏడు చేపల కథ చిత్రాల్లో దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాల ప్రచార చిత్రాలను యూట్యూబ్‌లో వీక్షిస్తున్నారని... ఎలాంటి నియంత్రణ లేదని లీగ్ ప్రతినిధులు సీపీ దృష్టికి తెచ్చారు.
సినిమాలను నిలిపేయండి
కేవలం ధనార్జనే ధ్యేయంగా దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని... వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యూత్ లీగ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ ప్రదీప్ కోరారు. సమాజానికి చేటు కలిగించే ఈ చిత్రాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. యువత చిత్రాల్లో అశ్లీల దృశ్యాలు చూసి... చిన్నారులపై అఘాయిత్యాలక పాల్పడేలా ప్రేరేపితులవుతున్నారని లీగ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : పోలింగ్ సమయం మార్చలేం: సుప్రీంకోర్టు