ETV Bharat / state

పీవీ సింధు, గోరటిలకు 2019 రామినేని పురస్కారాలు - రామినేని ఫౌండేషన్ 2019 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించారు

ప్రతిఏడాది వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి డాక్టర్​ రామినేని ఫౌండేషన్‌ సంస్థ పురస్కారాలు అందజేస్తోంది. ఈ సారి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే...

2019 రామినేని పురస్కారాల్లో పీవీ సింధు
author img

By

Published : Oct 9, 2019, 11:56 PM IST

2019 రామినేని పురస్కారాల్లో పీవీ సింధు

2019 సంవత్సరానికి పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ సంస్థ పురస్కారాలు ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, కూచిపూడి కళా కేంద్ర స్థాపకులు ఎ.బీ. బాల కొండలరావు, డాక్టర్‌ చంద్రశేఖర్‌లకు పురష్కారాలు అందచేయనున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ధర్మ ప్రచారక్‌ రామినేని తెలిపారు.

ఈనెల 12వ తేదీన నెక్లెస్​రోడ్‌లోని జలవిహార్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆ సంస్థ కన్వీనర్‌ పాతూరి నాగభూషణం ప్రముఖులతో కలిసి హైదరాబాద్​లో ఆవిష్కరించారు. పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ఉల్లి తగ్గింది... టమాట పెరిగింది- కిలో రూ.80!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.