విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా జగన్మాత దుర్గమ్మకు కాగడా మల్లెపూలు, జాజులు, మరువంతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. మూలవిరాట్ దుర్గమ్మ విగ్రహం వద్ద పుష్పార్చనకు వినియోగించే పూల బుట్టలను ఉంచి పూజ చేశారు. అనంతరం వాటిని ఉభయదాతలు, సేవా సంస్థల సభ్యులు, సంప్రదాయబద్ధంగా గోశాల వద్ద ఏర్పాటు చేసిన దుర్గమ్మ ఉత్సవ మూర్తి వద్దకు తీసుకొచ్చారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య..
అర్చకులు అమ్మవారికి పుష్పార్చన చేశారు. లలిత సహస్రనామం పఠించారు. అనంతరం పంచహారతులను సమర్పించారు. ఉభయదాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి లడ్డు ప్రసాదం, శేషవస్త్రం, రక్షణ కవచాన్ని దేవస్థానం అధికారులు అందజేశారు.
ఇదీ చదవండి: మినీ పుర ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీకి షబ్బీర్ అలీ లేఖ