Purified Water to all Villages in Telangana : సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్ల చొప్పున అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం పొందింది. గుజరాత్, గోవా, తెలంగాణ రాష్ట్రాలు వంద శాతం స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 35,988 గ్రామాలకు పూర్తి స్థాయిలో, 12,505 గ్రామాల్లో ఒక్కో వ్యక్తికి 40 లీటర్ల లోపు నీటిని అందిస్తున్నారని తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నలపై కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభకు ఈ వివరాలను నివేదించింది.
జలమట్టాలు పడిపోయిన జిల్లాల్లో కర్నూలు మొదటి స్థానంలో: 2011 నవంబరు నుంచి 2022 నవంబరు వరకు పలు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జల మట్టాలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే ఏపీలోని కర్నూలు జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో పదేళ్ల కాలంలో 31.74 మీటర్ల లోతుకు మట్టం పడిపోయింది. కృష్ణా జిల్లాలో 15 మీటర్ల లోతుకు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 17.54 మీటర్లకు, మెదక్‌లో 17.07, కరీంనగర్ జిల్లాలో 15.43, మహబూబ్‌నగర్ జిల్లాలో 10.22 మీటర్ల లోతుకు జల మట్టం పడిపోయింది.
ఇవీ చదవండి: