Essential prices Hike in Telangana : ఖరీఫ్- రబీ సీజన్లకు మధ్య ఉన్న కాలంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య మానవుడు తనకి నచ్చింది తినాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి గుండెల్లో గుబులు పుడుతున్నాయి. చివరికి ఏది తక్కువగా ఉంటే దాంతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంటోంది.
Kandipappu Price Hike : పప్పులు, కూరగాయల ధరలు చూస్తుంటే తినాలనే ఆశ చచ్చిపోతుంది. కిలో రూ.50 ఉన్న ఉల్లిపాయలు, టమాటాలు ప్రస్తుతం రూ.30కి తగ్గినా పూర్వస్థాయికి తగ్గలేదు. కూరగాయలైతే కిలో రూ.70 నుంచి రూ.80 వరకూ ఉన్నాయి. కందిపప్పు ధర రూ.40 నుంచి రూ.70 వరకూ పెరిగింది. ఇలానే మరిన్ని పప్పుల ధరలు పెరిగాయి.
Daily Essentials Price Hike Telangana : అమ్మ బాబోయ్.. పెరిగిన నిత్యావసరాలు.. ఇక కొనలేం.. తినలేం..?
Minapa dal Today Price : రెండు నెలల క్రితం రూ.150 వరకూ ఉన్న కందిపప్పు ధర(Kandipappu Price Today) ప్రస్తుతం రూ.220 ఉంది. మిగతా పప్పుల ధరలు కూడా రూ.20 నుంచి రూ.30 వరకూ పెరిగాయి. ఇడ్లీ, దోశ వేసుకుందామంటే మినప పప్పు ధర చూసి సామాన్యులు భయపడుతున్నారు. కిలో రూ.180 వరకూ ఉంది. రూ.వందకు దొరికే పెసరపప్పు కూడా రూ.140కి పైగా పెరిగిపోయింది.
Vegetable Price Increase : కిలో బీరకాయ రూ.80లు అయింది. 10 రోజుల క్రితం వరకూ కిలో రూ.35లు ఉన్న బెండకాయ ఒక్కసారి రెట్టింపు ధర పలుకుతోంది. ప్రస్తుతం రూ.70గా ఉంది. దాదాపు చాలా కూరగాయలు రూ.70- 80కి చేరుకున్నాయి. ఇక కిలో అల్లం రూ.160, వెల్లుల్లి కిలో రూ.370 చొప్పున మార్కెట్లో లభిస్తోంది. రైతుబజారు ధరలు కిలో దగ్గర రూ.10 నుంచి 15 తక్కువగా ఉన్నా అక్కడ కూడా ధరలు చూస్తే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిత్యవసర ధరల వివరాలు :
వస్తువు | 2 నెలల క్రితం ధర(కిలో) | ప్రస్తుతం ధర(కిలో) |
కందిపప్పు | రూ.150 | రూ.220 |
పెసరపప్పు | రూ.100 | రూ.140 |
పప్పు ధర | రూ.180 | |
అల్లం | రూ.160 | |
వెల్లుల్లి | రూ.370 | |
బీరకాయ | రూ.80 | |
బెండకాయ | రూ.35(10 రోజుల క్రితం) | రూ.70 |
పాతాళానికి పడిపోయిన పత్తి ధరలు - నష్టాల మూటలే రైతన్నకు దిగుబడులు
Rice Bag Price Hike in Telangana : ఓ వైపు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు, మరోవైపు బియ్యం కొనలేక వినియోగదారుడు అవస్థలు పడుతున్నాడు. నవంబరులో సోనామసూరి కిలో బియ్యం రూ.60 వరకూ ఉంది. డిసెంబరులో కిలో రూ.67 చొప్పున అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం ధర కూడా కిలో రూ.50 నుంచి రూ.55ల వరకూ ఉంది. సోనామసూరి సన్నబియ్యమే పలు బ్రాండ్లు పెట్టి 25 కేజీల బస్తాలను రూ.1650 నుంచి రూ.1700(25kg Rice Bag Price)లకు పైగా అమ్ముతున్నారు. నెల రోజుల్లో రూ.200లకు పైగా 25 కేజీల బస్తా దగ్గర పెరిగినట్టు కృష్ణనగర్‌లోని బియ్యం, పప్పుల హోల్‌సేల్ మార్కెట్ నిర్వాహకుడు గణేష్ చెప్పారు.
Vegetables Price Hike in Telangana : కూరగాయలు ధరలు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే!