ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 30న హైదరాబాద్‌లో ప్రజా తిరుగుబాటు మార్చ్ నిర్వహించనున్నట్లు విపక్ష నేతలు ప్రకటించారు. విద్యానగర్‌లో విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నిర్ణయాలు పాటిస్తూనే ఉద్యమం ద్వారా ఆర్టీసీని పరిరక్షించుకుంటామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజా, న్యాయవ్యవస్థ అగ్రహానికి గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు. కార్మికులను మంత్రులతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండిః "డెడ్లైన్లకు భయపడేది లేదు... ఆర్టీసీకి అసలు బోర్డేలేదు"