ETV Bharat / state

రేపు నింగిలోకి కార్టోశాట్‌-3 ఉపగ్రహం - పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌ తాజా వార్తలు

షార్​లో పీఎస్‌ఎల్‌వీ-సి47 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటలపాటు కొనసాగనుంది.

PSLV-C47
PSLV-C47
author img

By

Published : Nov 26, 2019, 11:58 AM IST

రేపు నింగిలోకి కార్టోశాట్‌-3 ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాల్ని పంపేందుకు రంగం సిద్ధం చేసింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక ఇందుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగమిది.

సోమవారం ఉదయం పది గంటలకు రిహార్సల్‌ను విజయవంతంగా ముగించారు. అనంతరం ఆబార్డ్‌ టెస్టు నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 26 గంటలపాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పీఎస్‌ఎల్‌వీ-సి47 వాహకనౌక బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మన దేశానికి చెందిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని రాకెట్‌ బయలుదేరిన 17.42 నిమిషాలకు 515 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో వదులుతుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఉపగ్రహాల్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

కార్టోశాట్‌-3 ప్రత్యేకతలివి...
కార్టోశాట్‌-3 ఉపగ్రహం బరువు 1,625 కిలోలు. జీవిత కాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహం నిఘాకు ఉపయోగపడుతూ దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయనుంది. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. ఇందులోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్‌ చిత్రాల్ని తీసే సామర్థ్యముంది. సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ కార్టోశాట్‌ సేవలందించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉపగ్రహ తయారీకి రూ.350 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

Intro:Body:

నేటి నుంచి పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట పీఎస్‌ఎల్‌వీ-సి47 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రక్రియ 26 గంటలపాటు కొనసాగనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాల్ని పంపేందుకు సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక ఇందుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగమిది. సోమవారం ఉదయం పది గంటలకు రిహార్సల్‌ను విజయవంతంగా ముగించారు. అనంతరం ఆబార్డ్‌ టెస్టు నిర్వహించారు. మంగళవారం ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. సోమవారం జరిగిన రాకెట్‌ సన్నద్ధత సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ణయించారు. రాకెట్‌ అనుసంధానం, ఉపగ్రహాల అమరిక, తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత నిర్వహించిన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశంలో రాకెట్‌ ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. నిరంతరాయంగా 26 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పీఎస్‌ఎల్‌వీ-సి47 వాహకనౌక బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మన దేశానికి చెందిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని రాకెట్‌ బయలుదేరిన 17.42 నిమిషాలకు 515 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో వదులుతుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఉపగ్రహాల్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

కార్టోశాట్‌-3 ప్రత్యేకతలివీ...

కార్టోశాట్‌-3 ఉపగ్రహం బరువు 1,625 కిలోలు. జీవిత కాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహం నిఘాకు ఉపయోగపడుతూ దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయనుంది. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. ఇందులోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్‌ చిత్రాల్ని తీసే సామర్థ్యముంది. సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ కార్టోశాట్‌ సేవలందించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉపగ్రహ తయారీకి రూ.350 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.