హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తీరుపై భాజపా ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట 6వ నంబరు చౌరస్తాలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
పోరాడి సాధించుకున్నాం..
యావత్ హిందూ సమాజం ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసి సుప్రీంకోర్టులో గెలిచి సాధించుకున్న రాముడి జన్మస్థలం రామజన్మభూమి అని భాజపా నగర అధ్యక్షుడు గౌతం రావు అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం అవుతుంటే.. తెరాసకు చెందిన ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మొత్తం హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఫ్లెక్సీ వివాదం: తెరాస, కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ