చిన్నారులపై ఆంగంతుకుల అకృత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలంటూ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇందిరాపార్కు వద్ద ధర్నచౌక్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు రక్షణ కరవైందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. మహిళలపై అఘయిత్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: 'చిన్నారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం'