కొవిడ్ నేపథ్యంలో సామూహికంగా నిరసనలపై ఆంక్షలున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో నిరసనకు దిగింది. సిటీ ఆఫ్ లేక్స్గా పిలువబడిన హైదరాబాద్లో చెరువులు ఇప్పుడు కాలుష్యకారకాలుగా మారుతున్నాయని.. మానవ తప్పిదాలు, స్వార్థంతో అన్యాక్రాంతం అవుతున్నాయని యూత్ ఫర్ ఫ్రైడేస్ ఆర్గనైజేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. క్లైమేట్ జస్టిస్ అనే నినాదంతో గండిపేటలోని ఉస్మాన్ సాగర్ చెరువు వద్ద వెయ్యికి పైగా బూట్ల జతలతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడానికి, బూట్లతో నిరసనకు సంబంధం ఏంటి, సొసైటీ సభ్యులు ఏం కోరుకుంటున్నారో చూద్దాం.
ఇవీ చూడండి: భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం