ETV Bharat / state

'శ్రీశైలంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణాన్ని ఆపాలి' - శ్రీశైలం కుమారస్వామి ఆలయం ఆపాలంటూ ధర్నా

శ్రీశైలంలో నిర్మిస్తున్న కుమారస్వామి ఆలయ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర జంగమ సమాజం హైదరాబాద్​లో డిమాండ్​ చేసింది. కుమారస్వామి ఆలయ ఎత్తు పెద్దగా నిర్మించడం.. హిందు ధర్మానికి విరుద్ధమైందని జంగమ సమాజం అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

protest to stop srisailam kumaraswamy temple construction
'శ్రీశైలంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణాన్ని ఆపాలి'
author img

By

Published : Sep 28, 2020, 6:48 PM IST

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కుమారస్వామి ఆలయ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర జంగమ సమాజం హైదరాబాద్​లో డిమాండ్​ చేసింది. శ్రీశైల భ్రమరాంబ మాత ప్రాశస్త్యం తగ్గించేలా కుమారస్వామి ఆలయం ఎత్తు పెద్దగా నిర్మించడం భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలకు విరుద్ధమని సమాజం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరయ్య మండిపడ్డారు.

ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఇప్పటికే శ్రీశైలం ఆలయ ఈవో, ఏపీ ముఖ్యమంత్రి, దేవాలయ శాఖ అధికారులకు ఈ-మెయిల్​ ద్వారా సమాచారం అందించామని విశ్వేశ్వరయ్య తెలిపారు. అవసరమైతే తమ ప్రాణాలైన అర్పించి.. ఆలయాన్ని నిర్మించకుండా అడ్డుకుంటామన్నారు. లేని పక్షంలో హిందు సంప్రదాయాలకు విరుద్ధంగా కడుతున్న ఆలయ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరుతామని విశ్వేశ్వరయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండిః మట్టపల్లి దేవాలయంలోకి.. పులిచింతల వరద నీరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.