హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లోని 'ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్' వాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. లక్షలు పెట్టి ఇళ్లు కొన్న తమకి.. కనీస వసతులు కల్పించడంలో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ నిర్మాణ సంస్థ విఫలం అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ లేకపోవడం వల్ల జీహెచ్ఎంసీ, జలమండలికి అదనంగా సొమ్ము చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాట్స్ కొనేముందు మూడు సంవత్సరాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలిచ్చిన నిర్మాణ సంస్థ... ఇప్పుడు తమ సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. కార్పస్ నిధి కింద ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కొంత మొత్తం చొప్పున మొత్తం 10కోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని సౌకర్యాలకు ఖర్చు చేయకుండా వారి వద్దే ఉంచుకున్నారని తెలిపారు.
తమ గోడు చెప్పుకోవడానికి వారి వద్దకు వెళ్తే కనీసం లోపలి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి.. పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: ఎండకాలంలో చల్లగా.. స్టైల్‌గా సన్‌గ్లాసెస్..!