వీహెచ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంబర్‌పేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్కను సన్మానించేందకు వచ్చిన తమని తీవ్రపదజాలంతో దూషించారని ఆరోపించారు. వీహెచ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్ఎస్యూఐ మాజీ జాతీయ కార్యదర్శి మోహన్, యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.