తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని అభియోగాలను ఎదుర్కొంటున్న 127 మంది ఆధార్ కార్డుదారుల విచారణ ఈ ఏడాది మే నెలకు వాయిదా పడింది. ప్రాథమిక విచారణ అనంతరం యుఐడీఏఐకి పోలీసులు అందించిన వివరాల ఆధారంగా వీరికి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న ఆధార్ కార్డుదారులు ఈ నెల 20వ తేదీన ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ ఎదుట ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది.
కానీ విచారణను ఎదుర్కొంటున్న కార్డుదారులు ఆధార్ పొందే సమయంలో నివేదించిన ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల సేకరణకు ఇప్పుడిచ్చిన సమయం సరిపోదని భావించిన యుఐడీఏఐ అధికారులు ఆ విచారణను వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే నెలలో ఏ తేదీన అన్నది ప్రకటనలో స్పష్టం చేయకపోయినా మొదటి వారంలో ఉండొచ్చని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి