వాణిజ్య రహదారుల పొడవునా ఆస్తిపన్ను పునర్‌మదింపు సర్వే (Property tax reassessment survey) పూర్తయింది. జీహెచ్‌ఎంసీ రెవెన్యూ (GHMC Revenue) విభాగం ఆధ్వర్యంలో 709 కి.మీ పొడవునా రోడ్లకు ఇరువైపులా ఉన్న భవన సముదాయాల వివరాలను అధికారులు సేకరించారు. వాటిని ఎలాంటి వ్యాపారాలకు వినియోగిస్తున్నారు? అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించారా? నివాస భవనం కోసం అనుమతి తీసుకుని వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నారా? ఇతరత్రా వివరాలను నమోదు చేసుకున్నారు. మొబైల్ యాప్‌లో సమాచారాన్ని నిక్షిప్తం చేశామని, ఇప్పుడు ఆ సమాచారాన్ని నిర్మాణ అనుమతుల సమాచారంతో పోల్చి చూస్తున్నామని బల్దియా చెబుతోంది. ప్రక్రియ పూర్తయితే అక్రమ నిర్మాణాల లెక్క, అదనపు అంతస్తుల వివరాలూ వెలుగులోకి వస్తాయంటోంది. అనంతరం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న భవనాలకు జరిమానా, 100 శాతం అదనంగా ఆస్తిపన్ను విధిస్తారు. ఈ లెక్కన జీహెచ్‌ఎంసీకి రూ.100 కోట్ల ఆదాయం రానుంది. ఆస్తిపన్ను విలువను పెంచి మరో రూ.500 కోట్ల ఆదాయాన్ని(GHMC Revenue) సముపార్జించే ప్రక్రియ సైతం పురోగతిలో ఉందని ఆర్థిక విభాగం స్పష్టం చేస్తోంది. అందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని, ఈ విధానం రాష్ట్రంలోని కొత్త నగరపాలక సంస్థల పరిధిలో ఎప్పట్నుంచో అమలవుతోందని అధికారులు గుర్తుచేస్తున్నారు .
నిరాశ కలిగిస్తోన్న ఆదాయం
లాక్‌డౌన్, ఇతరత్రా సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీహెచ్‌ఎంసీ ఆదాయం (GHMC Revenue) గణనీయంగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.200 కోట్ల లోటు తలెత్తింది. పరిస్థితిని అధిగమించేందుకు వాణిజ్య రహదారులపై అక్రమంగా నడుస్తోన్న వ్యాపార సముదాయాల పన్ను పెంచడానికి (GHMC Revenue) అధికారులు సమాయత్తమవుతున్నారు. అక్టోబరులో పన్ను చెల్లించని ప్రతి ఇంటికి వెళ్లి పన్ను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలాఖరు నాటికి రూ.440 కోట్లు వసూలు చేయాలని అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ.. జడ్సీలకు, డీసీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: GHMC: ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను నిర్ధరణ... కొత్త భవనాలు, ఇళ్లకు ఉపయోగం
GHMC Administration Division : పైసలిస్తే చాలు కావాల్సిన చోటికి బదిలీ.. పదోన్నతి!
special commissioner: జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్
Tolet fine: హైదరాబాద్లో ‘టు-లెట్’కు రూ.2 వేల జరిమానా
GHMC: 'సొంతింటి టూలెట్ బోర్డుకు జరిమానా లేదు.. ఉంటే మా దృష్టికి తీసుకురండి!