ఈనెల 27 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి కోరారు. పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు.
ఇవీ చదవండి: