ETV Bharat / state

Limbadri: 'నాణ్యమైన విద్యకు తెలంగాణను హబ్‌గా మారుస్తాం' - telangana becomes as education hub

విద్యా ప్రణాళికను బలోపేతం చేస్తే నాణ్యమైన విద్య అందుతుందని, తద్వారా ఏటా డిగ్రీలో చేరుతున్న 2.30 లక్షల మందిలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి. నాణ్యమైన విద్యకు రాష్ట్రాన్ని హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.

limbadri
ఆర్‌.లింబాద్రి
author img

By

Published : Aug 30, 2021, 7:34 AM IST

ఇంజినీరింగ్‌తో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్‌సీ వంటి సంప్రదాయ డిగ్రీలకు ఈ కాలంలో డిమాండ్‌ ఏముంటుందన్న భావన అధిక శాతం మందిలో ఉంది. అయినా రాష్ట్రంలో ఇంటర్‌ పాసైన వారిలో ఎక్కువ మంది చేరేది ఆ కోర్సుల్లోనే. వాటిని చిన్నచూపు చూడకుండా.. ఆ కోర్సుల విద్యార్థులకూ మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కేలా వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి. విద్యా ప్రణాళికను బలోపేతం చేస్తే నాణ్యమైన విద్య అందుతుందని, తద్వారా ఏటా డిగ్రీలో చేరుతున్న 2.30 లక్షల మందిలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. ప్రైవేటు కళాశాలల్లోనూ సౌకర్యాల పెంపునకు ప్రోత్సహిస్తున్నామని, నాణ్యమైన విద్యకు రాష్ట్రాన్ని హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. ఛైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయనతో ప్రత్యేక ముఖాముఖి.

ఇంజినీరింగ్‌ కోర్సుల వారికే ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాలు లభిస్తాయన్న భావన ఉంది. సంప్రదాయ డిగ్రీలు చదివితే కొలువులు దక్కవా?

వాస్తవానికి బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సులను సంప్రదాయ డిగ్రీలని ఇప్పుడు అనలేం. కాలానుగుణంగా వాటిని సంస్కరించుకుంటూ వస్తున్నాం. గత ఏడాదే బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌, బీఎస్‌సీ డేటా సైన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాం. వాటి సిలబస్‌ రూపకల్పన నుంచే టీసీఎస్‌ సంస్థను భాగస్వామ్యం చేశాం. రాష్ట్రంలో 120 కళాశాలల్లో ఆ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తారు. టీసీఎస్‌ నిర్వహించే ఎంప్లాయిబిలిటీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 100 బహుళ జాతీయ సంస్థ(ఎంఎన్‌సీ)ల్లో ఉద్యోగాలకు పోటీపడేందుకు అర్హత సాధిస్తారు. అతి త్వరలో దీనిపై ప్రైవేట్‌ కళాశాలలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. అలానే ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు బ్రిటీష్‌ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం.

రాష్ట్రంలో కళాశాలల సంఖ్య అధికంగా ఉన్నా నాణ్యమైన బోధన అందించేవి అతి తక్కువ ఉన్నాయి కదా?

న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపున్న కళాశాలలు (ఇంజినీరింగ్‌ సహా) రాష్ట్రంలో 240 వరకు ఉన్నాయి. ప్రైవేట్‌ కళాశాలలు ముందుకు వస్తే న్యాక్‌ గుర్తింపు పొందేందుకు అవసరమైన సెల్ఫ్‌ స్టడీ రిపోర్ట్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) రూపకల్పనకు ఉన్నత విద్యామండలి రూ.లక్ష అందించేందుకు సిద్ధంగా ఉంది. యాజమాన్యాలను ఈ దిశగా ప్రోత్సహించి మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తాం. యూజీసీ సైతం న్యాక్‌ గ్రేడ్‌ను తప్పనిసరి చేస్తున్నందున కళాశాలలు సమాయత్తం కావడం అనివార్యం.

ఉన్నత విద్య సీట్లలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతుందా?
100 శాతం అమలవుతుంది. ఎంసెట్‌లో కూడా అమలు చేస్తాం. దానిపై అనుమానం వద్దు.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

రెండు నెలల కిందే అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి వర్చువల్‌ కార్యశాల నిర్వహించాం. జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది తొమ్మిది డిగ్రీ కళాశాలల్లో క్లస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. కమిటీలను నియమించాం. అవిచ్చే నివేదికలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి తెస్తాం. జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌ ప్రాంగణంలో బీఫార్మసీ కోర్సును ప్రారంభిస్తున్నాం.

రాష్ట్రం నుంచి ఏటా వేల సంఖ్యలో విదేశీ విద్యకు వెళ్తున్నా.. వారికి మార్గనిర్దేశం చూపేవారు(మెంటార్‌) లేరు. ఉన్నత విద్యామండలి అందుకు సహకరిస్తుందా?

వివిధ దేశాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న తెలుగు సంఘాల సహకారంతో విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేస్తాం. ఉన్నత విద్యామండలిలో ‘ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌’ పేరిట విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ-మెయిల్‌ తదితర మార్గాల ద్వారా విద్యార్థుల నుంచి ప్రశ్నలు, సందేహాలను స్వీకరిస్తాం. వాటిని ఆయా దేశాల్లోని సంఘాల ప్రతినిధులకు పంపి సమాధానాలు తెప్పించి, విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. త్వరలోనే ఇది ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: REVANTH REDDY: చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.