ETV Bharat / state

Kodandaram fires on CM KCR : 'రాజకీయాలను కేసీఆర్‌ కార్పొరేట్‌ మయం చేశారు' - తెలంగాణ బచావో యాత్ర

Kodandaram Reaction on TJS merger : ప్రభుత్వ అధికారాన్ని, వనరులను సీఎం కేసీఆర్ విచ్చల విడిగా వాడుకుంటున్నారని టీజేఎస్ పార్టీ​ అధినేత ఆచార్య కోదండరాం ఆరోపించారు. భూ, ఇసుక దందాలు, సెటిల్ మెంట్లకు బీఆర్​ఎస్​ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ రెండు అంశాలే తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్​లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. మరోసారి తమ పార్టీ విలీనంపై స్పందించారు.

Kodandaram
Kodandaram
author img

By

Published : Jun 18, 2023, 5:34 PM IST

Updated : Jun 18, 2023, 6:09 PM IST

Acharya Kodandaram Latest News : ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల భూములను తన కుటుంబం పేరు మీద రాయించుకున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్​ఎస్​ నేతలు భూ, ఇసుక దందాలు, సెటిల్‌ మెట్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ అధికారాన్ని, వనరులను సీఎం కేసీఆర్ విచ్చల విడిగా వాడుకున్నారని మండిపడ్డారు.

ఈ రెండు అంశాలే తెలంగాణ అభివృద్ధికి ఆటకం కల్గిస్తున్నాయని కోదండరాం అభిప్రాయపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇస్తామని వాగ్దానం చేసిన పదివేల పరిహారం ఇంత వరకు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్​ చుట్టూ కొత్తగా నిర్మించబోయే రీజనల్​ రింగ్​ రోడ్డు అవసరం లేదని కోదండరాం అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రీజినల్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో విచ్చలవిడిగా ప్రైవేటికరణ పెరిగిపోతుందని దుయ్యబట్టారు.

Kodandaram on Telangana Bachao Yatra : తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ తొమ్మిదేళ్లలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాజకీయంగా దోచుకొని ఊరు లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాలు మారకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఉద్యమ, ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన ఫ్రొఫెసర్ జయశంకర్ గ్రామం అక్కంపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర చేస్తామని వెల్లడించారు.

టీజేఎస్​ ఏ పార్టీలో విలీనం కాదు: ధరణి, తెలంగాణ బచావో పేరుతో సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు వివరించి.. చైతన్యవంతం చేస్తామన్నారు. తెలంగాణ జన సమీతి వీలనంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి​ కోదండరాం స్పందిచారు. టీజేఎస్​ స్వతంత్రంగా ఉంటుందని.. ఏ పార్టీలో విలీనం కాదని పునరుద్ఘాటించారు.

"రాజకీయాలను కేసీఆర్ కార్పొరేట్ మయం చేశారు. హైదరాబాద్ చుట్టూ పక్కల భూములను తన కుటుంబం పేరు మీద రాయించుకున్నారు. ఉద్యమ, ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసి ఉద్యమిస్తాం. హైదరాబాద్ కాకుండా నియోజకవర్గాల కేంద్రంగా ఉద్యమిస్తాం. ఈనెల 21న ఫ్రొఫెసర్ జయశంకర్ గ్రామం అక్కంపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర చేస్తాం. డబ్బులతో రాజకీయం ఆట ఆగాలి. ప్రశ్నాపత్రాల వ్యాపారం ఎప్పుడైనా చూశామా.. డబ్బుల వల్ల రాజకీయాలు పతనమయ్యాయి. రాజకీయాలు పతనమైతే.. ప్రజల జీవితాలు నాశనమవుతాయి. ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి చైతన్యవంతం చేస్తాం."- కోదండరాం, టీజేఎస్​ అధ్యక్షుడు

'రాజకీయాలను కేసీఆర్‌ కార్పొరేట్‌ మయం చేశారు'

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2023, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.