ETV Bharat / state

ఈనెల 27న జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం ఈనెల 27న జరగనుంది. కొవిడ్-19 నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి ఆన్‌లైన్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

profecer jayashankar university convagation day on 27 august
ఈనెల 27న జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సం
author img

By

Published : Aug 25, 2020, 10:14 PM IST

ఈనెల 27న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కొవిడ్​ -19 నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి ఆన్‌లైన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ స్నాతకోత్సవం మార్చి 18న జరగాల్సి ఉంది. కానీ కరోనాతో వాయిదా వేశారు.

విద్యార్థులు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అనుమతితో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఈ స్నాతకోత్సవం నిర్వహించాలని వర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. గవర్నర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

గోవిందరాజులుకు డాక్టర్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఈ సందర్భంగా 104 మంది పీజీ డిగ్రీలు, 603 మంది యూజీ డిగ్రీలు పొందనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది పీజీ, 11 మంది యూజీ విద్యార్థులకు బంగారు పథకాలు అందజేయనున్నామని వీసీ తెలిపారు.

ఇదీ చదవండి- బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.