తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమానికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి;నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టు