Producer Anjireddy Murder Case Update : సికింద్రాబాద్ పద్మరావునగర్‌కు చెందిన వ్యాపారి, సినీ నిర్మాత సీహెచ్.అంజిరెడ్డి దంపతులు స్థానికంగా ఉన్న ఇంటిని విక్రయించాలనుకున్నారు. సొమ్ము చేతికి అందాక అమెరికాలో స్ధిరపడాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇంటిని విక్రయించే బాధ్యతలు పరిచయం ఉన్న దేవినేని రవికి అప్పగించారు. ఈ విషయాన్ని రవి ఎల్లారెడ్డిగూడకు చెందిన రాజేష్‌కు చెప్పాడు.
Producer Anji Reddy Murder Mystery Solved : అంజిరెడ్డి ఇంటిని చూసిన రాజేష్ రూ.3కోట్ల 50లక్షలకు కొనుగోలు చేసేందుకు అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు సొంతం చేసుకోవాలనే దురాలోచనతో నిర్మాత హత్యకు పథకం వేశాడు రాజేశ్. తన వద్ద తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసే ప్రభుకుమార్, బిహార్‌కు చెందిన సత్యేందర్, జయమంగళకుమార్, రాజేష్‌కుమార్‌లకు రూ.4 లక్షలు, సుపారీ కుదుర్చుకున్నాడు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాలనే వ్యూహరచన చేశారు.
Film Producer Anji Murder Case : పథకం అమలు చేసేందుకు రాజేష్ గత నెల 29న అంజిరెడ్డికి ఫోన్ చేసి జీఆర్ కన్వెన్షన్ హాలు వద్దకు రప్పించాడు. తన కారులో అక్కడకు చేరిన అంజిరెడ్డి కారును రెండో సెల్లార్‌లో పార్కు చేశాడు. జీఆర్ కన్వెన్షన్ హాలుకు చేరాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆరుగురు.. నిందితుడిని బెదిరించి ఆ ఇంటిని రూ.2.10 కోట్లకు విక్రయించినట్టు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. లిఫ్ట్ వద్దకు చేరగానే అంజిరెడ్డిపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని లిఫ్ట్ ద్వారా సెల్లార్‌లోని అతడి కారు వద్దకు తీసుకెళ్లారు. అంజిరెడ్డి మృతదేహాన్ని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొబెట్టారు.
ఇంజన్ ఆన్ చేసి వెనుక నుంచి నెట్టడంతో వేగంగా వెళ్లిన కారు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఇదంతా ప్రమాదంగా చిత్రీకరించి అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అంజిరెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అంజిరెడ్డి ప్రమాదంలో మరణించలేదని గుర్తించారు. నిందితుల ప్రవర్తన, మాటలు, సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తొలుత తమకేం తెలియదని బుకాయించారు. ఆ తరువాత ఆస్తి కోసమే ఈ దారుణానికి తెగించినట్టు అంగీకరించారు. నిందితులు రాజేష్, ప్రభుకుమార్, సత్యేందర్, మంగళకుమార్, రాజేష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మహబూబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్యకేసులో నిందితుడికి మరణశిక్ష