ETV Bharat / state

లాక్​డౌన్​తో పండ్ల రైతులకు కష్టాలు.. ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి

కోస్తే ఖర్చు రాదు.. అమ్మడానికి ధర లేదు.. బత్తాయి తరలించాలన్నా.. అమ్మాలన్నా కష్టాలు తప్పడం లేదు. ఇదీ రైతుల పరిస్థితి. పుచ్చకాయలు, మామిడికి ధర లేక కర్షకులు అనేక అవస్థలు పడుతున్నారు. స్వయంగా వినియోగదారుల వద్దకే విక్రయిస్తున్న రైతులు.. కాలనీలు, బహుళ అంతస్తుల భనవాల సంఘాలు ఫోన్‌ చేస్తే నేరుగా చేరవేస్తున్నారు. ఈ క్రమంలో కిలో ద్రాక్ష ధర రూ. 50కు చేరుకుంది. ప్రజలంతా పండ్లు తింటే ఈ దిగుబడులు చాలవు. జనమంతా వినియోగిస్తే.. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు రైతులకు ఆదాయం చేకూరనున్న దృష్ట్యా... ఆయా అంశాలపై ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

లాక్​డౌన్​తో పండ్ల రైతులకు కష్టాలు.. ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి
లాక్​డౌన్​తో పండ్ల రైతులకు కష్టాలు.. ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి
author img

By

Published : Apr 18, 2020, 5:01 AM IST

Updated : Apr 18, 2020, 7:38 AM IST

రాష్ట్రంలో వ్యవసాయ పంటలు కోతలు, అమ్మకాలకు లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి ప్రభుత్వం మినహాయించి సాయపడుతున్నా గ్రామస్థాయిలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఆంక్షల వల్ల బత్తాయి, మామిడి, ద్రాక్ష, పుచ్చకాయ వంటి పంటలను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం వల్ల ధరలు దిగజారుతున్నాయి. పండిన పంటలకు ధరల్లేవని రైతులు వాపోతుంటే... ప్రజలంతా రోజూ కనీసం 100 గ్రాముల పండ్లు తింటే ఈ దిగుబడులు ఏ మాత్రం సరిపోవని ఉద్యాన శాఖ స్పష్టం చేసింది. పంటలకు ధర, డిమాండ్ పెరిగి రైతులకు ఆదాయం అధికమవుతుందని ఆ శాఖ తాజాగా ప్రభుత్వానికి తెలిపింది.

ఏటా ఈ సీజన్‌లో మామిడి పండ్లు మార్కెట్లకు వెల్లువెత్తేవి. ఇప్పుడు లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా కాయలు తోటల్లో తెంపి అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా మామిడి తోటులను రైతుల నుంచి కోతకు ముందే కొందరు వ్యాపారులు గుత్తకు తీసుకుని జనవరి నుంచే రైతులకు కొంత అడ్వాన్సుగా చెల్లిస్తారు. అలా చెల్లించిన వారంతా మార్చిలో లాక్‌డౌన్‌ పెట్టినప్పటి నుంచి వెనక్కితగ్గుతున్నారు. అడ్వాన్సులు, తోటలను రైతులకే వదిలేస్తున్నారు. మార్కెట్‌లో ఈ పంట అమ్మకాలు పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో అతిపెద్దదైన హైదరాబాద్​ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు శుక్రవారం కేవలం 1096 టన్నులు వచ్చాయి. సాధారణ పరిస్థితులు ఉంటే ఇంతకు రెట్టింపు పైగా వచ్చేవని వ్యాపారులు తెలిపారు.

టన్ను మోడల్ ధర రూ. 18,500 వరకు ఉంది. అత్యల్పంగా రూ. 10 వేలకు పడిపోయింది. బత్తాయి అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా ఊపందుకోలేదు. చెట్ల నుంచి బత్తాయిలు కోయాలన్నా రైతులు వెనుకాడుతున్నారు. ఇప్పుడు 50 లక్షల బత్తాయిలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో టన్ను బత్తాయిల ధర 35 నుంచి 40 వేల రూపాయల దాకా ఉంటుంది. కానీ, శుక్రవారం గడ్డిఅన్నారం మార్కెట్‌లో మోడల్ ధర రూ. 8,500కు పడిపోయింది. అత్యల్పంగా 6 నుంచి గరిష్టంగా 18 వేల రూపాయలకు పెరిగింది. దిల్లీ మార్కెట్‌ తెరిచి డిమాండ్ పెరిగితే తప్ప తెలంగాణ బత్తాయిలకు ధర పెరగదని కమీషనర్ ఏజెంట్లు, మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంటాబయటా ప్రతి ఒక్కరూ శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యహితమైన బత్తాయి రసం తాగాలని తాము ప్రచారం చేస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి తెలిపారు.

గతంలో తెలంగాణ ద్రాక్షకు దేశమంతట ఎంతో పేరుండేది. ఇప్పుడు కేవలం 2500 ఎకరాల్లోనే ద్రాక్ష తోటలు సాగువుతున్నా.. ఆ కాస్త పంటకూ డిమాండ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జంట నగరాల్లో కాలనీలు, గేటెట్ సమూహాలు, బహుళ అంతస్తుల సంఘాలు ఫోన్ చేస్తే నేరుగా ఇంటి వద్దే వచ్చి ద్రాక్ష పండ్లు అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌కు మందు కిలో రూ. 100 వరకూ పలికిన ద్రాక్ష ధర ఇప్పుడు 40 నుంచి 50 రూపాయలకు పడిపోయింది.

వేసవి తీవ్రతకు పుచ్చకాయలు తినడం వల్ల ఎంతో చల్లగా ఉంటుంది. కేవలం 6 వేల ఎకరాల్లోనే పుచ్చకాయలు సాగవగా.. అందులో వచ్చే పంటకూ ధరల్లేక రైతులు నష్టపోతున్నారు. కిలో బరువు ఉండే పెద్ద పరిమాణం గల పుచ్చకాయలను కూడా 20 నుంచి 30 రూపాయలకే అమ్ముతున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో కొందరు రైతులు పుచ్చకాయ సాగు చేశారు. ఎకరంలో రూ. 40 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. లాక్‌డౌన్ అమలు ఉన్నందున ప్రస్తుతం పంటను ఎవరూ కొనడం లేదని.. పెట్టుబడైనా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు పంపుదామన్నా వాహనాలకు భారీగా కిరాయి అడుగుతున్నారని... ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుగుతున్నారు.

రాష్ట్ర ప్రజల్లో కేవలం 25 శాతం లోపే రోజూ పండ్లు తింటున్నట్లు ఉద్యాన శాఖ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా కోరలు చాస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోడానికి రోగనిరోధక శక్తి పెంచే పండ్లు ఎక్కువగా తినాలి. ప్రతి ఒక్కరూ మామిడి, బత్తాయి, నిమ్మ వివిధ రూపాల్లో తీసుకుంటే.. కరోనా మహమ్మారి లాంటి ఏ రోగం రాదని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి.

మే 3 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న దృష్ట్యా బత్తాయి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని దిల్లీలో మార్కెట్‌కు తెరిపించేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. సోమవారం నుంచి హైదరాబాద్ నుంచి బత్తాయి సరకు ఎగుమతి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండటం పెద్ద ఉపశమనమే.

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

Last Updated : Apr 18, 2020, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.