హజీపూర్ బాధిత కుటుంబాలను ప్రియాంకా గాంధీతో కలిపిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బాధితుల బాధలను ప్రియాంక దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రియాంక అపాయింట్మెంట్ కోసం లేఖ రాస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలను కేసీఆర్ ఇప్పటివరకు పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులూ పట్టించుకోలేదన్నారు.
ఇదీ చూడండి:చంద్రయాన్-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!