ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో ప్రధాని మోదీ ప్రశంసలు - Prime Minister Narendra Modi latest information

వీధి వ్యాపారుల కోసం తీసుకున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం అమల్లో అగ్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ ప్రశంసలు లభించాయి.

Prime Minister Modi praises the Telangana state government
రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో ప్రధాని మోదీ ప్రశంసలు
author img

By

Published : Nov 25, 2020, 8:00 PM IST

వీధి వ్యాపారుల కోసం తీసుకున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం అమల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు లభించాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... గ్రామీణ గృహనిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పీఎం స్వనిధి సహా పలు మౌలికవసతుల ప్రాజెక్టులపై సమీక్షించారు.

వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు రుణాల మంజూరు, పంపిణీలో తెలంగాణ రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రధానమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో ఐదు లక్షల 88వేల మంది వీధివ్యాపారులను గుర్తించి అందులో 72 శాతం నాలుగు లక్షలా 29వేల రుణ దరఖాస్తులను అప్​లోడ్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు లక్షల ఏడు వేల మంది వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేసి లక్షా 76వేల రుణాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. వీధి వ్యాపారులకు సంబంధించి సర్వే కోసం మొబైల్ అప్లికేషన్​ను అభివృద్ధి చేశారని... మూడు నెలల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రేపటి నుంచి రంగంలో దిగనున్న కేంద్ర మంత్రులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.