ETV Bharat / state

దేవునికి పువ్వులు... జేబులకు చిల్లులు

పండుగ వేళ నగరంలో పూల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వినాయకచవితి సందర్భంగా తోటల్లోని పూలన్నీ అంగట్లోకొచ్చాయి. తాజా పుష్పాలతో అంగట్లో వీధులన్నీ రంగు రంగుల కాంతులీనుతున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కొచ్చింది. కోరిన వరాలిచ్చే దేవున్ని పూలతో అర్చించాలంటే పర్సులు ఖాళీ అవుతున్నాయి. ధరలు నింగిని తాకుతూ పుష్పం, పత్రం, ఫలం అంటే బాబోయ్​ అనిపిస్తున్నాయి.

దేవునికి పువ్వులు... జేబులకు చిల్లులు
author img

By

Published : Sep 1, 2019, 10:48 PM IST

భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ వినాయక చవితి. చవితినాడు ప్రతీ తెలుగు లోగిలీ రంగుల సోయగాలను అద్దుకునేందుకు సన్నద్ధమైంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, వ్యాపారులు భారీ మొత్తంలో పూలతో ముంచెత్తారు. ముఖ్యంగా నగరంలోని మొజంజాహీ మార్కెట్, గుడి మల్కాపూర్, కొత్త పేట మార్కెట్లలో పూలరాసులు కనువిందు చేస్తున్నాయి. తాజా బంతి, చామంతులు, గులాబీలు, హైబ్రిడ్ వెరైటీలతోపాటు... కలువ, గన్నేరు, నందివర్థనం, మల్లె, మరువం పువ్వులు గిరాకీగా ఉన్నాయి. ఇక ఫలాల విషయానికొస్తే మొక్కజొన్నలు, చెరకు గడలు, వెలగపండ్లుతోపాటు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి.

అన్నీ అందుబాటులో ఉన్నా... ధరలే నింగిని తాకుతున్నాయి

పండుగ దృష్ట్యా పత్రికి, ఫలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. ప్రధానంగా పూజకోసం వినియోగించే పుష్పాలకు, ఫలాలకు, పత్రి ధరలకు రెక్కలొచ్చాయి. రైతు బజార్లలోనూ తామర మొదలుకొని... బంతి, చామంతుల ధరలు చుక్కలు అంటుతున్నాయి. ఇక బహిరంగ మార్కెట్లో ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇవీ ఓ కారణం

సాధారణంగా పండుగ రోజుల్లో పువ్వులు, పళ్లు ధరలు పెరగడం సహజమే. కానీ ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురవటం.... ఆశించిన స్థాయిలో పంట దిగుబడి లేకపోవడంతో ధర ఆకాశనికంటింది. కిలో కనకాంబరాలు రూ. 800 నుంచి 1000కి పైగానే పలుకుతున్నాయి. బంతి రూ.100, చామంతి రూ. 300, గులాబీ రూ. 400 వందలు, ఉండగా ఒక్కో కలువ పువ్వునే రూ.30 విక్రయిస్తున్నారు. పండుగ రోజున భగవంతుడిని పుష్పాలతో అర్చించాలంటే ధరలు వణుకు పట్టిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.

అందరికీ భారమే

ఏడాదికోసారి చేసుకునే పండుగ... జీతాలొచ్చిన వేళ అని కొందరు ఎలాగోలా కొనేస్తున్నారు. కానీ రోజువారీ కూలీలు, చిన్ని చితకా పనులు చేసుకునే వారికి, సాధారణ ప్రజలకు ధరలు తలకు మించి భారంగా అనిపిస్తున్నాయి. అధికారులు ఈ ధరలపై నియంత్రణ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవునికి పువ్వులు... జేబులకు చిల్లులు

ఇదీ చూడండి: భద్రాద్రిలో అమ్మవారికి పుష్పార్చన

sample description

For All Latest Updates

TAGGED:

flowers
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.