రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండురోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
రేపు ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలో నిర్మించిన... ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రాన్నిసందర్శించనున్నారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా మిషన్ న్యూ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌లోని శాంతివనాన్ని కూడా ఆయన తిలకించనున్నారు.