ETV Bharat / state

Draupadi Murmu Hyderabad tour : హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతి.. ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు - Draupadi Murmu hydrebad tour

President Draupadi Murmu visit to Telangana : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పర్యటన నేపథ్యంలో హైదరాబాద్​ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఆమెకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. రేపు దుండిగల్​లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరగనున్న గ్రాడ్యుయేషన్ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్​ డే పరేడ్​లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొనున్నారు.

Draupadi Murmu Hyderabad tour
Draupadi Murmu Hyderabad tour
author img

By

Published : Jun 16, 2023, 7:34 PM IST

Updated : Jun 16, 2023, 8:09 PM IST

హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతి.. ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు

President Draupadi Murmu at Dundigal Air Force Academy : దుండిగల్​లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్ డే పరేడ్​లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్​కు చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి రాజ్‌ భవన్​కు చేరుకున్నారు.

ఇవాళ రాత్రి రాష్ట్రపతి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం బేగంపేట నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్​లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. ప్రి కమిషన్డ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్‌ పోర్స్​కు చెందిన పలు విభాగాల క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్​లో ఆమె పాల్గొంటారు. ఈ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఆమె రివ్యూయింగ్ అధికారిగా ఉండనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పట్టాలు అందించడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు బహుకరించనున్నారు.

ఇందులో భాగంగా క్యాడెట్లకు శిక్షణ ఇచ్చిన పలు ఎయిర్‌ క్రాప్ట్​లను ఆమె తిలకించనున్నారు. పలు కార్యక్రమాలను సైతం ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఉదయం 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి దిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్​భవన్​లో బస దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో బలగాలు విధుల్లో ఉన్నాయి.

ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్లు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు సాయంత్రం 4గం నుంచి 8గంటల వరకూ రేపు ఉదయం 6గంటల నుంచి ఉదయం 8గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ సమయాల్లో రాజ్‌ భవన్ రోడ్​ను పూర్తిగా మూసివేయున్నారు. పంజాగుట్ట నుంచి మెట్రో భవన్ వరకూ ఉన్న రహదారిని మూసివేయున్నారు. మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను రసూల్‌పురా వద్ద నిలిపివేయనున్నారు.

అమీర్ పేట నుంచి బేగంపేట ఎయిర్​పోర్ట్ వైపు వచ్చే వాహనాలు ప్రకాశ్ నగర్ టీ జంక్షన్ వద్ద నిలిపివేయనున్నట్లు తెలిపారు. బాలానగర్ నుంచి వచ్చే వాహనదారులు ఫతేనగర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌, బాల్కంపేట్, మైత్రీవనం మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు పై ఆంక్షలను గుర్తించి పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చాలా రోజుల అనంతరం ఒకే కార్యక్రమంలో గవర్నర్, సీఎం : రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్​ అనే విధంగా పరిస్థితులు మారిన విషయం తెలిసిందే.. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఇద్దరూ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. చాలా రోజుల అనంతరం వారు ఇరువురు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 16, 2023, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.