President Conway Rehearsal: శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం నుంచి రాజ్‌భవన్ వరకు పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు, రాష్ట్రపతి భద్రత సిబ్బంది రూట్ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నారు.
సుమారు మూడు పర్యాయాలు రాష్ట్రపతి నిలయం నుంచి రాజభవన్ వరకు కాన్వాయ్‌తో రిహార్సల్స్ చేపట్టారు. డిసెంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో ఉండనున్నారు. అయితే రాష్ట్రపతి రాకపై అయోమయం నెలకొంది. కొవిడ్ ఉద్ధృతి కారణంగా షెడ్యూల్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రాత్రి వరకు స్పష్ఠత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: