ETV Bharat / state

యాసంగికి ఏర్పాట్లు చేయండి

యాసంగి ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాసంగిలో 45 మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు.

పౌరసరఫరాల శాఖ పై మంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష
author img

By

Published : Mar 1, 2019, 11:23 PM IST

పౌరసరఫరాల శాఖ పై మంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష
యాసంగి పంటకు సంబంధించి ధాన్యం సేకరణకు ఏప్రిల్​ 1 నాటికి అన్ని ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ పనితీరుపై మంత్రి సచివాలయంలో సమీక్షించారు. ఆ శాఖ కమిషనర్​ అకున్​ సబర్వాల్​, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఏటా సాగు విస్తీర్ణంతో పాటు ధాన్యం దిగుబడి పెరుగుతోందన్నారు. యాసంగిలో దాదాపుగా 9 లక్షల హెక్టార్లలో వరి పంట వేశారని.. 45 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా 44 మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 2017-18 సంవత్సరంలో 54 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కమిషనర్​ అకున్​ సబర్వాల్​ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2018-19 ఖరీఫ్​లోనే 40.7 లక్షల మెట్రిక్​ టన్నుల పంట కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని వివరించారు.

రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కేంద్రాల వద్ద గోనె సంచులు, తేమను కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రబీ సీజన్​కు సంబంధించి త్వరలో హైదరాబాద్​లో అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:వీరుడికి ఘనస్వాగతం

Intro:Hyd_Tg_56_01_vekthi_mruthi_srnagar_AB_c28...
ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోరబండ డివిజన్లోని స్థానిక swarajya నగర్ లో మసీదులో మేస్త్రి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతానికి చెందిన మంగళ సింగ్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది... యాంకర్.... ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక బండ డివిజన్లో స్వరాజ్ నగర్ లో మధ్యప్రదేశ్ చెందిన మంగళ్ సింగ్ అనే వ్యక్తి స్థానిక మసీదులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో మృతిచెందాడు

Body:ఈ విషయంపై స్థానికులు స్పందించి స్థానిక సనత్నగర్లోని నీలిమ హాస్పిటల్ కి తరలించారు మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు

Conclusion:ఈ విషయంపై స్థానిక ఎస్సార్ నగర్ లో స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు... మంగళ సింగ్ మృతి పట్ల తోటి కార్మికుడు కాశీ మాట్లాడుతూ మసీదు పనులు నిర్వహిస్తున్న ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తోటి కార్మికుడు కాశీ తెలిపారు....bite.... తోటి కార్మికుడు కాశీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.