HUGE BOUQUET: హైదరాబాద్ విద్యానగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో.. కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా ఒక రికార్డు సాధించాలని.. మేనేజ్మెంట్ భావించింది. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కోసం భారీ పుష్పగుచ్ఛాన్ని విద్యార్థులు రూపొందించారు. గురువారం పలు రకాలకు చెందిన 53,516 పుష్పాలను వినియోగించి 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో కళాశాల ప్రాంగణంలో దీన్ని తయారు చేశారు.
ఇటీవల లిమ్కా బుక్ఆఫ్ రికార్డు సాధించేందుకు.. 10 మంది పాకశాస్త్ర నిపుణులు, 20 నుంచి 30 మంది విద్యార్థులు.. 4 గంటల పాటు శ్రమించి 75 రకాల బిర్యానీలను తయారు చేశారు. వాటి ప్రాధాన్యతను తెలియజేసేలా.. బోర్డులను ఏర్పాటు చేసినట్లు హోటల్ మేనేజ్మెంట్ విభాగాధిపతి తెలిపారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయామని.. 75 రకాల బిర్యానీ వంటకాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: 75 TYPES OF BIRYANI: ఒకే చోట 75 రకాల బిర్యానీలు.. ఎక్కడోకాదు మన హైదరాబాద్‌లోనే..