ETV Bharat / state

వైద్యుల నిర్వాకం... నడిరోడ్డుపైనే ప్రసవం

పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. చివరికి.. ఆసుపత్రి ఎదుటే ప్రసవం జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చూసిన వారందరూ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

delivery before hospital
ఏపీ వార్తలు
author img

By

Published : May 13, 2021, 10:19 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన సాయి సింధూర వైద్యశాల ఎదుట చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిని కొవిడ్​ వైద్యశాలగా మార్చారు. ప్రస్తుతం అక్కడి ప్రసూతి వార్డును తాత్కాలికంగా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు.. సాయి సింధూర ఆస్పత్రికిి తరలించారు. బెస్తవారిపేట మండలం గార్లకుంటకు చెందిన గర్భిణి త్రివేణి.. పురిటినొప్పులు వస్తుండగా కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు ఆమెకు మంచం కేటాయించకుండా.. గంటల తరబడి వైద్యశాల బయటే ఉంచేశారు. ఎంత బతిమాలుకున్నా ఫలితం లేక.. ఆమెను ఒంగోలు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో... నొప్పులు ఎక్కువై.. నడి రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన చూసిన వారు ఆస్పత్రి సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితే తమకూ ఎదురైందని మరో గర్భిణి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు.

ఇదీ చూడండి: 'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.