ETV Bharat / state

ఓటు వేయడానికి వెళ్తున్నారా...? ఈ జాగ్రత్తలు పాటించండి.. - Ghmc elections 2020

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో.. ప్రస్తుత తరుణంలో కొవిడ్‌ నిబంధనలను పాటించడమూ అంతే ముఖ్యం. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనుండడంతో.. ఓటర్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకోవాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది. ఇంటి వద్ద బయల్దేరినప్పటి నుంచీ ఓటేసి తిరిగివచ్చే వరకూ వైరస్‌ కట్టడి మార్గాలను పాటించాలని పేర్కొంది. కరోనా జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు.

GHMC
ఓటు వేయడానికి వెళ్తున్నారా...? ఇవి పాటించండి
author img

By

Published : Dec 1, 2020, 6:37 AM IST

  • ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడానికి ముందే ముఖానికి మాస్కు ధరించాలి. వీలైతే వెంట ఒక చిన్న సీసాలో శానిటైజర్‌ను తీసుకెళ్లాలి.
  • పోలింగ్‌ కేంద్రం వద్ద వరుసలో నిలుచున్నపుడు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి.
  • పోలింగ్‌ సిబ్బంది కచ్చితంగా మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు ధరించడంతో పాటు ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రపర్చుకోవాలి.
  • పోలింగ్‌ కేంద్రం లోనికి వెళ్లాక.. గుర్తింపు కార్డును అక్కడి అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ పుస్తకంలో సంతకం చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ సిబ్బంది ఇచ్చే బ్యాలెట్‌ పత్రాన్ని, ఓటు ముద్రిత స్టాంపును కూడా చేత్తో తీసుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఒకరి నుంచి మరొకరికి వస్తువులు చేతులు మారతాయి. అజాగ్రత్తగా ఉంటే వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది.
  • సాధారణంగా పోలింగ్‌ బూత్‌ ఒక గదిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో గాలి, వెలుతురు బాగా ఉండే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బందితో పాటు ఓటర్లు కూడా కచ్చితంగా మాస్కు ధరించాలి.
  • అవకాశం ఉంటే పోలింగ్‌ కేంద్రం లోనికి, వెలుపలకు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.