ETV Bharat / state

PRC for Telangana Government Employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. పీఆర్సీ ఏర్పాటు.. 5% ఐఆర్‌

PRC for Telangana Government Employees : శాసనసభ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 5 శాతం మధ్యంతర భృతిని కూడా ప్రకటించింది. ఆర్థిక అంశాలు ప్రత్యేకించి ఉద్యోగుల అంశాలపై సంపూర్ణ అవగాహన ఉన్న శివశంకర్‌ను కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ నెల నుంచి ఇవ్వనున్న ఐఆర్​తో ఖజానాపై ఏడాదికి 2 వేల కోట్ల వరకు భారం పడనుంది. 'పే రివిజన్ కమిటీ' నియమించాలన్న సీఎం ఆదేశాల పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

CM KCR Announces PRC for Government Employees
CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 9:16 AM IST

CM KCR Announces PRC for Government Employees రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం మధ్యంతర భృతి

PRC for Telangana Government Employees : ఉద్యోగులకు మంచి వేతన సవరణ ఇస్తామని, ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర భృతి కూడా ప్రకటిస్తామని ఇటీవల అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రకటించారు. ఈ ఏడాది జూలై నుంచి కొత్త వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్(Telangana Assembly Election Schedule) వెలువడేలోగా పీఆర్సీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణ కోసం కమిషన్ ఏర్పాటు చేశారు.

Pay Revision Committee Telangana : కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్, సభ్యునిగా మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీ.రామయ్యను నియమించారు. శివశంకర్ సుదీర్ఘ కాలంగా ఆర్థికశాఖలో పని చేస్తున్నారు. ఉద్యోగుల సంబంధిత అంశాలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. పదవీ విరమణ చేసిన అనంతరం కూడా ఆర్థికశాఖ సీనియర్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు గతంలో పీఆర్సీ(PRC) కమిషన్ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు.

Interim Relief in Telangana 2023 : గత రెండు వేతన సవరణ అమల్లోనూ కీలకంగా వ్యవహరించారు. దీంతో శివశంకర్‌ను కమిషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. సభ్యుడుగా నియమితులైన రామయ్య.. అన్ని అంశాలపైనా చాలా లోతుగా అధ్యయనం చేస్తారని పేరుంది. ఆర్నెళ్లలోగా నివేదిక ఇవ్వాలని కమిషన్​ను ఆదేశించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగుల వేతనాలు, ఇతర రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పరిశీలించి సిఫార్సులు చేయాలని తెలిపింది. రాష్ట్ర రెవెన్యూ వృద్ధి, చేయాల్సిన చెల్లింపులు, ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.

Telangana PRC Commission : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ కమిషన్​ ఏర్పాటు

Telangana Announces PRC for Government Employees : అటు వేతన సవరణ సంఘం నివేదిక వచ్చి నిర్ణయం తీసుకునే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల వేతనం నుంచి ఐఆర్ అమలవుతుందని ప్రభుత్వం తెలిపింది. 2020 వేతన సవరణ వర్తించిన అన్ని స్థాయిల ఉద్యోగులకు ఐఆర్ వర్తిస్తుందని పేర్కొంది. 5 శాతం మధ్యంతర భృతితో ఖజానాపై ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించిన రెండు డీఏలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మూడో డీఏ(DA) గడువు కూడా పూర్తైనందున.. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగులకు ఆరోగ్య పథకంతో పాటు సీపీఎస్(CPS) రద్దు విషయమై కూడా నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. ముఖ్యమంత్రితో త్వరలో సమావేశం ఉంటుందని.. ఈ భేటీతో మిగతా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావంతో ఉన్నాయి.

PRC Telangana 2023 : ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 'పే రివిజన్ కమిటీ' ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామంగా ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన.. 9 ఏళ్లలో 2 పీఆర్సీలు ఇవ్వటంతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మూడో పీఆర్సీని నియమించి, ఉద్యోగుల సంక్షేమానికి సర్కార్‌ కట్టుబడి ఉందని మరోసారి నిరూపించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన టీఎన్​జీవో(TNGO) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్, టీజీవో సెంటర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, ఏ సత్యనారాయణ, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఆర్‌ 5 శాతమే నిరాశ కలిగించిందన్న టీఎస్​యూటీఎఫ్(TSUTF).. రెండు డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరింది.

Electricity Employees PRC: విద్యుత్​ ఉద్యోగులకు 7 శాతం ఫిట్​మెంట్

TNGO and TGO leaders meet kcr : "వేతన సవరణపై.. ​త్వరలోనే కేసీఆర్ సానుకూల ప్రకటన"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.