ETV Bharat / state

'హైదరాబాద్​లో జనరేటర్​ వాడుతున్నారా.. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా' - prashanth reddy response on botsa comments about generator usage in hyderabad

Prashanth Reddy Comments on Botsa: ఏపీపై మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యల పట్ల పొలిటికల్​ కౌంటర్లు మొదలయ్యాయి. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లేవన్న కేటీఆర్​ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స.. హైదరాబాద్​లోనే కరెెంటు లేక జనరేటర్​పై ఆధారపడ్డామని వ్యాఖ్యానించారు. బొత్స వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి ప్రశాంత్​ రెడ్డి స్పందించారు. ఉన్న విషయం మాట్లాడితే ఎందుకంత అక్కసని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Prashanth Reddy Comments on Botsa
బొత్స వ్యాఖ్యలపై ప్రశాంత్​ రెడ్డి స్పందన
author img

By

Published : Apr 29, 2022, 4:56 PM IST

Prashanth Reddy Comments on Botsa: హైదరాబాద్‌లో విద్యుత్‌ లేక జనరేటర్‌ వాడుతున్నామన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి స్పందించారు. ఆ మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. బొత్స కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటుందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్​ గురించి కేటీఆర్​ ఉన్న విషయం చెప్పారని... బొత్స ఎందుకంత అక్కసుగా మాట్లాడాలని ప్రశ్నించారు.

ఏపీ అభివృద్ధికి తాము అడ్డుపడటం లేదన్న ప్రశాంత్​ రెడ్డి.. విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైదరాబాద్‌ వస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి చెందితే తమకు సంతోషమేనన్నారు. కానీ తెలంగాణలో అన్నీ సదుపాయాలు ఉన్నాయి కాబట్టే.. వ్యాపార రంగం వృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. తెరాస హయాంలో తెలంగాణలో రోడ్లు బాగున్నాయని ప్రజలకు తెలుసని వెల్లడించారు.

"క్రెడాయ్​ ప్రాపర్టీ షోలో ఏపీ గురించి మంత్రి కేటీఆర్​ నిజాలే మాట్లాడారు. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ సైతం.. గతంలో విద్యుత్​ కోతలు తప్పవని చెప్పారు. ఆ విషయమే ఇప్పుడు కేటీఆర్​ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం హైదరాబాద్​లోనే ఉంటోంది. కరెంట్​ లేక జనరేటర్​ వాడుతున్నామన్న మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏపీ అభివృద్ధి చెందితే మాకూ సంతోషమే. కానీ విజయవాడలో స్థిరాస్తి రంగం వృద్ధి చెందడం లేదు. హైదరాబాద్​లో అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే.. వ్యాపారులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు." -ప్రశాంత్​ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి

హైదరాబాద్​లో జనరేటర్​ వాడుతున్నారా.. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా: ప్రశాంత్​ రెడ్డి

ఇవీ చదవండి: 'ఏపీలో కరెంట్, నీళ్లు, రోడ్లు ఏమీ లేవు.. అక్కడ ఉండలేక హైదరాబాద్ వస్తున్నారు..'

KTR Vs AP Ministers: 'నేను హైదరాబాద్​ నుంచే వచ్చా.. అక్కడసలు కరెంటే లేదు'

మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్​ 460 పాయింట్లు డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.