ETV Bharat / state

ఆ ఉద్దేశంతోనే ప్రపంచ శాంతి సభల నిర్వహిస్తున్నామన్న కేఏ పాల్ - ప్రపంచ శాంతి సభలు తాజా వార్తలు

KA Paul Conduct Global Peace prayer Meetings ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఆక్టోబర్​ 2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభలను నిర్వహించనున్నట్లు కేఏ పాల్​ తెలిపారు. ఈ సభలకు ప్రపంచ దేశాల్లోని ప్రధానులు, మంత్రులు హాజరవుతారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్​ను కూడా ఆహ్వానించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు.

కేఏ పాల్​
కేఏ పాల్​
author img

By

Published : Aug 29, 2022, 5:34 PM IST

KA Paul Conduct Global Peace prayer Meetings: చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచ శాంతి సభలను తిరిగి నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. అక్టోబర్ 2న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో 10లక్షల మందితో శాంతి సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో ప్రపంచ శాంతి సభల పోస్టర్​ను కేఏ పాల్​ ఆవిష్కరించారు. ఈ సభలకు ప్రపంచ దేశాల్లోని ప్రధానులు, మంత్రులు హాజరవుతారని.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఈ సభలను నిర్వహిస్తున్నామని కేఏ పాల్ తెలిపారు. గాంధీ జయంతి రోజును నిర్వహించే ఈ సభ ద్వారా రాజకీయ నాయకుల్లో ఆ స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేఏ పాల్​ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: సీఎం కేసీఆర్ ఇప్పటికీ మారకపోతే జైలు జీవితం తప్పదు: కేేఏ పాల్​

వరదల్లో కొట్టుకుపోయిన మూడు మృతదేహాలు, మంటల్లో కాలిపోతూనే నదిలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.