ETV Bharat / state

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 7:28 AM IST

Praja Palana Program Ended in Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐదు గ్యారెంటీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గడిచిన 8 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన సదస్సుల్లో 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. కుటుంబాలకన్నాఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ అర్జీల్లోని సమాచారం ఆధారంగా, ఐదు పథకాలకు లబ్ధిదారుల ఎంపికను సర్కార్‌ మొదలుపెట్టనుంది. కాగా వచ్చే నెలలో మరో మూడు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Praja Palana Program in Telangana
Praja Palana Program
ప్రజాపాలనకు విశేష స్పందన కోటి దాటిన అర్జీలు

Praja Palana Program Ended in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన(Congress Party Praja Palana) కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 1,11,46,293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన జరగ్గా, 8 రోజుల్లో 1,24,85,383 అర్జీలు వచ్చాయి. ఒక కుటుంబం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెప్పినా నిబంధనల్లో స్పష్టత లేక పలు కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.

ఐదు గ్యారెంటీ పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, మిగతా అవసరాలకు 19,92,747 వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయి. శనివారం ఒక్కరోజే 16,90,000ల దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రజాపాలన ప్రారంభం కాగా డిసెంబర్ 31, జనవరి 1 సెలవు దినాలు మినహాయిస్తే, ఎనిమిది రోజుల పాటు రెండు పూటలా గ్రామ, వార్డు సభలు జరిగాయి.

Praja Palana Program : హైదరాబాద్ మహానగరంలో అభయహస్తం గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణకు 150 డివిజన్లలో 650 కేంద్రాలను బల్దియా ఏర్పాటు చేసింది. నగరవ్యాప్తంగా 24,74,325 మంది అర్జీలు పెట్టుకున్నట్లు వెల్లడించింది. ప్రజాపాలన చివరి రోజున 3,22,147 దరఖాస్తులు అందినట్లు తెలిపింది. అభయహస్తం 5 గ్యారెంటీల్లో ఎక్కువగా నగరవాసులు మహాలక్ష్మి, గృహాజ్యోతి పథకానికి మొగ్గు చూపగా, రేషన్ కార్డులు కావాలని పెద్దసంఖ్యలో జనం అదనంగా దరఖాస్తు చేసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏడు రోజుల్లో, మూడు జిల్లాల్లో కలిపి 12,38,000ల పైచిలుకు అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత సర్కార్‌ కంటే ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని, దరఖాస్తు చేసుకున్న గ్యారెంటీలకు అర్హులుగా గుర్తిస్తుందని దరఖాస్తుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

Praja Palana Program Applications Telangana : ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజాపాలన సదస్సులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దరఖాస్తు చేయనివారు తర్వాతైనా చేసుకోవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తులోని వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా ఎంట్రీ ఈనెల 17 నాటికి పూర్తి చేయనున్నారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ చేస్తారు. ఇప్పటికే ఆ విషయంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. అవసరమైతే ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు.

Huge Response Praja Palana in Telangana : దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా ఐదు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, బడ్జెట్ అంచనాలపై కసరత్తు చేయనున్నారు. నెలాఖరునాటికి కసరత్తు పూర్తిచేసి వచ్చే నెలలో మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో రూ.500లకే సిలిండర్, గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, చేయూత కింద పింఛన్లు రూ.4000లకుపెంపు త్వరలో ప్రారంభించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ముగిసిన ప్రజాపాలన- దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు

'కోటె'త్తిన అప్లికేషన్లు - ప్రజాపాలన దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.