ETV Bharat / state

వరద నీరు అడ్డంకి.. కొనసాగుతున్న విద్యుత్​ మరమ్మతులు - సబ్​స్టేషన్లలోకి వరద నీరు

భారీ వర్షం విద్యుత్ శాఖకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఎస్పీడీసీఎల్​కు రూ.5 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.2 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. 89 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్లు రెండు నుంచి మూడు ఫీట్ల లోతు నీటిలోనే మునిగిపోయి ఉండటం వల్ల 37 అపార్ట్​మెంట్లకు, మరో 57 కాలనీలకు విద్యుత్ సౌకర్యం లేక.. ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. వాటిలో నీళ్లు ఎప్పుడు తొలగిపోతే.. ఆ క్షణమే విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. నీటిని తోడే దిశగా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. వర్షం, వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు ఆరువేల మంది ఉద్యోగులు, సిబ్బంది రేయింబవళ్లు విధులు నిర్వహించినట్టు విద్యుత్​  అధికారులు తెలిపారు.

power restoration works Continuing in hyderabad
వరద నీరు అడ్డంకి.. కొనసాగుతున్న విద్యుత్​ మరమ్మతులు
author img

By

Published : Oct 21, 2020, 6:42 AM IST

వారం రోజులక్రితం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు. ఆగినట్టే ఆగి.. తిరిగి వర్షాలు కురవడం వల్ల పరిస్థితి తిరిగి ఎప్పట్లాగే మారిపోతుంది. వర్షాల కారణంగా చాలా కాలనీలు, అపార్ట్​మెంట్లలో నీళ్లు చేరిపోయాయి. వారం రోజులుగా అనేక కాలనీలు అంధకారంలోనే ఉంటున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 3,041 ఉండగా...17 సబ్ స్టేషన్లలోకి నీరు వచ్చి చేరింది. విద్యుత్ శాఖ రేయింబవళ్లు పనిచేసి.. తిరిగి వాటిని పునరుద్దరించారు. 11కేవీ ఫీడర్లు మొత్తం 15,203 ఉంటే.. వాటిలో 1,080 ఫీడర్లు వర్షం కారణంగా మరమతులకు గురయ్యాయి. వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,167 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్లలోకి నీరు వచ్చి చేరింది. వాటిలో 1,078 డీటీఆర్​లకు మరమతులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో సుమారు 22 డీటీఆర్​లు ఫెయిల్ అయ్యాయి. ఇంకా 89 ట్రాన్స్​ఫార్మర్లు ఉన్న ప్రాంతంలో రెండు నుంచి మూడు ఫీట్ల నీరు నిల్వ ఉండటం వల్ల వాటిని సరి చేయడం విద్యుత్ సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది.

ఇంకా తేలలేదు..

జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 37 అపార్ట్​మెంట్లలోని సెల్లార్లలో ఇప్పటికీ నీరు అలాగే ఉంది. నీరు తోడేస్తున్నా.. తిరిగి మళ్లీ వస్తోందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. సెంట్రల్ సర్కిల్​లోని.. పావని ప్లాజా, యూటవర్స్, 21 సెంచరీ కాంప్లెక్స్, దయాల్ కన్ స్ట్రక్షన్స్, హుస్సేన్ బిల్డింగ్​, మహావీర్ హౌస్, శ్రీసాయి కిర్లోస్కర్, గుప్త ఎస్టేట్, శ్రీరామ కాంప్లెక్స్, డైమండ్ టవర్, భగీరథ అపార్ట్​మెంట్, హెచ్ఎస్​ రెసిడెన్సీ, అక్బర్ పుర అపార్ట్​మెంట్స్. సికింద్రాబాద్ సర్కిల్​లోని విశ్వరూప అపార్ట్​మెంట్స్, మోడల్ టవర్స్, ప్రవీణ్ కుమార్ అండ్ అదర్స్, జయనిలయం, మణికంఠ క్రౌన్, నారాయణాద్రి, విజయ్ శ్రీ నిలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, అనురాగ్ కాంప్లెక్స్, అనురాగ్ హాస్పిటల్స్, పాకాల ప్లాజా, పద్మజా అపార్ట్ మెంట్, ఎన్7 ఫంక్షన్ హాల్. సైబర్ సిటీ సర్కిల్​లోని ఇంధ్రప్రస్థ విల్లా అపార్ట్​మెంట్స్, శాంభవి అపార్ట్​మెంట్స్, హబ్సిగూడ సర్కి ల్​లోని గౌస్ ఖాన్, టీవీకే రెడ్డి, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఓం సాయి కన్​స్ట్రక్షన్స్​, వాయు విహార్ కన్​స్ట్రక్షన్, శక్తి శ్రీరామ్, సనా గార్డెన్ అపార్ట్​మెంట్లలో ఇంకా భారీగా వర్షపు నీరు ఉంది.

ఇంకా నీటిలోనే కాలనీలు..

జీహెచ్ఎంసీలోని 52 కాలనీలు ఇంకా జలమయంలోనే ఉన్నాయి. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో అల్ జుబీర్ కాలనీ, మైసారం ప్రాంతం, ఒమేర్ కాలనీ, అఫీజ్ బాబానగర్ కాలనీలు, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో హిందీ మహా విద్యాలయ, టీఆర్ బిల్డింగ్ పీటీ-1, టీఆర్ బిల్డింగ్ పీటీ-2, నదీం కాలనీ పీటీ-1, నదీం కాలనీ పీటీ-2, నదీం కాలనీ నాలా పీటీ, జీసస్ వాటర్ పీటీ, అక్బర్ మసీద్ కాలనీలు సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజ్, పైఎలక్ట్రానిక్స్, జయలుక్కాస్, అయ్యప్పకాలనీ-1, అయ్యప్పకాలనీ-2, తారకరామ-1, తారకరామ-2, అంబేడ్కర్, నగర్ కాలనీలు నీటిలోనే ఉన్నాయి. హబ్సిగూడ సర్కిల్ పరిధిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, గౌస్ ఖాన్, సనా గార్డెన్ ఎదురుగా, సెయింట్ జోసెఫ్ స్కూల్, సుమా రెసిడెన్సీ-1, సుమారెసిడెన్సీ-2, లక్ష్మినగర్-1, మధురానగర్, శ్రీక్రిష్ణానగర్, ఆర్టీసీ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ఈ కాలనీలకు ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్దరణ జరగలేదు.

విధుల్లో 6 వేల మంది సిబ్బంది..

భారీ వర్షానికి ఎస్పీడీసీఎల్ పరిధిలో 5,036 విద్యుత్ స్థంభాలు దెబ్బతిన్నాయి. వీటిలో తిరిగి 2,337 విద్యుత్ స్థంభాలను పునరుద్ధరించారు. మిగిలినవి మూసీ పరివాహక ప్రాంతమైన నల్గొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లో ఉండడం వల్ల వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండి విద్యుత్ పనులకు ఆటంకం కలుగుతుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. వరద ఉధృతి తగ్గగానే విద్యుత్ పునరుద్ధరణ పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్నారు. విద్యుత్ చేరి దెబ్బతిన్న విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు, కేబుళ్లను విద్యుత్ శాఖ సొంత ఖర్చులతో మరమ్మతులు చేస్తుందని... వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి హామీ ఇచ్చారు. వర్షాలు, వరదల్లో సుమారు 6వేల మంది ఉద్యోగులు, సిబ్బంది రేయింబవళ్లు పాల్గొన్నారని, వారందరి కృషి వల్లే.. తక్కువ సమయంలోనే చాలా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా చేయగలుగుతున్నామని సీఎండీ తెలిపారు.

ఇదీ చూడండి: సుజాతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి: హరీష్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.