ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కష్టమేనంటున్న ఇంజినీరింగ్ అధికారులు - కాళేశ్వరం ప్రజేంటేషన్

Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వ్యయం, మేడిగడ్డ వద్ద జరిగిన నష్టంపై వివరించారు. కాళేశ్వరం కట్టాక ఇచ్చింది స్థిరీకరణ మాత్రమేనని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. భూసేకరణ సమస్యలతో కొత్త ఆయకట్టు కష్టమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం కిందనే అప్పులు ఇచ్చారన్నారు. సాధ్యమైనంత త్వరలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద పునరుద్దరణ పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు.

Power Point Presentation
Kaleshwaram Project
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 9:07 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీరింగ్​ అధికారుల పవర్​ పాయింట్ ప్రజేంటేషన్

Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యం, వ్యయం, మేడిగడ్డ, అన్నారం ఆనకట్టల సమస్యలు, పరిష్కారంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) రీడిజైనింగ్ వల్ల కలిగిన లాభనష్టాలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా అంబర్​పల్లి సమీపంలోని లక్ష్మీ ఆనకట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్​ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు. వీరి సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన లాభనష్టాలు, కొత్తఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు సహా అన్ని అంశాలను పవర్‌పాయింట్‌(Power Point Presentation) ప్రజెంటేషన్‌లో ఈఎన్సీ మురళీధర్​ ప్రస్తావిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తాం : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Kaleshwaram Project : ప్రాజెక్టు నిర్వహణ కోసం తీసుకున్న రుణాలు, చెల్లింపులు, అవసరమైన విద్యుత్ తదితర అంశాలను ఈఎన్సీ వివరించారు. ఐదేళ్లలో 173 టీఎంసీ(TMC)లు మాత్రమే లిఫ్ట్​ చేశారని మురళీధర్​ తెలిపారు. 2 టీఎంసీలు ఎత్తి పోసేందుకే దాదాపు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని వివరించారు. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు కాళేశ్వరం చేపట్టిన తర్వాత వ్యయం వాటి వినియోగాన్ని వివరించారు.

"మొత్తం రిజర్వాయర్​ స్టోరేజ్​ కెపాసిటీ చూస్తే 141 టీఎంసీలు. 19.63 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కింద ఉండనుంది. స్టేబులేజింగ్​ ఆయకట్టు 18.82 లక్షల ఎకరాలుగా ఉంది. కొత్త ఆయకట్టు కింద 98 వేల ఎకరాలు మొదట క్రియోట్​ చేశాము. ఎల్​ఎండీ నుంచి సిద్దిపేట మధ్యలో 18 లక్షల ఆయకట్టు చేయాల్సింది ఉంది. 1.67 లక్షల ఎకరాలు నిజాం సాగర్​కు కవర్​ చేయడం జరిగింది. ఎస్సాఆర్​ఎస్సీ కింద ఎల్​ఎండీని కవర్​ చేశాము. దాదాపు 10 లక్షల ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్లు ఇవ్వగలుగుతున్నాము." - మురళీధర్​, ఈఎన్సీ

Medigadda Barrage Issue : గతంలో చేపట్టిన ప్రాణహిత(Pranahitha), కాళేశ్వరం లక్ష్యం ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకెళ్లడమేనని ఈఎన్సీ మురళీధర్​ చెప్పారు. ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు మధ్యలో ప్రాజెక్టులు కట్టినట్లు వివరించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఈఎన్సీ ప్రస్తావించారు.

మేడిగడ్డ ఆనకట్టకి ఉత్పన్నమైన సమస్యలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన కాగ్ ప్రస్తావించిన అంశాలు సహా కేంద్ర జలసంఘం లేఖలు తదితరాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ రకాల పనులు సాగుతున్నాయని చెప్పారు. కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని సూచించారు.

'నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం నిర్వహణలో చూపించలేదు'

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి పెంచాలి : సింగరేణి రివ్యూలో భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.