దేశంలో కొన్ని కులాలే పరిపాలన సాగిస్తున్నాయని మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏకరూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన నారాయణ గురు పెరియార్ ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ గురు జయంతి వేడుకల్లో స్వామి గౌడ్ పాల్గొని నివాళులు అర్పించారు.
వందల ఏళ్ల క్రితమే...
వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే ఇప్పటికీ పరిపాలనను కొనసాగించడం... బలహీన వర్గాలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దేశంలో గుడి, బడి కొంతమందికే పరిమితి కావడంతో నారాయణ గురును జ్ఙాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏకరూప సిద్ధాంతం కోసం...
కుల, మతాలను పక్కన పెట్టి సామర్థ్యం ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరో, అలాంటి వ్యక్తులు ఏకరుప సిద్ధాంతంపై ఏకమయ్యే రోజు త్వరలోనే రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
'కొంతమందికే పరిమితమా'
అధికారం కొంతమందికే పరిమితం కావడం వల్ల నారాయణ గురు స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని ఆయన సూచించారు. 5జీ టెక్నాలజీలోనూ కుల వ్యవస్థ విజృంభిస్తోన్న సమయంలో సమసమాజ నిర్మాణానికి నారాయణ గురు ఆశయాలు సాధించాల్సిన అవసరముందని బూర నర్సయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి : 'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'