పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, రాజకీయ, ఆర్థిక లావాదేవీల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
తెలంగాణకు నీళ్లు లేకుండా తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నదే ప్రధానంగా నీళ్ల కోసమన్నారు. ప్రాజెక్టు అంశంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయమై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు