ETV Bharat / state

సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై విచారణ వాయిదా

చారిత్రక నేపథ్యం కలిగిన ఎర్రమంజిల్​ సముదాయంలో ప్రభుత్వం చేపట్టిన కొత్త భవనాల నిర్మాణాలపై పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

విచారణ వాయిదా
author img

By

Published : Jul 11, 2019, 5:59 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై వ్యాజ్యాల విచారణ రేపటికి వాయిదా పడింది. చారిత్రక ఎర్రమంజిల్‌ సముదాయంలోని భవనాలు కూల్చవద్దంటూ పిటిషనర్లు వాదనలు కొనసాగించారు. ప్రభుత్వం తమ భూమి ఆక్రమిస్తుందన్న నిజాం వారసుల వ్యాజ్యంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సర్కారును ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై వ్యాజ్యాల విచారణ రేపటికి వాయిదా పడింది. చారిత్రక ఎర్రమంజిల్‌ సముదాయంలోని భవనాలు కూల్చవద్దంటూ పిటిషనర్లు వాదనలు కొనసాగించారు. ప్రభుత్వం తమ భూమి ఆక్రమిస్తుందన్న నిజాం వారసుల వ్యాజ్యంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సర్కారును ఆదేశించింది.

విచారణ వాయిదా

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ

Intro:TG_MBNR_12_09_Fasal_Bheema_Yozana_PKG_TS10052
కంట్రిబ్యూటర్‌: చంద్రశేఖర్‌-మహబూబ్‌నగర్‌

( ) అతివృష్టి, లేదంటే అనావృష్టి... అకాల వర్షాలు, కరువు వంటి వాటితో పాటు ఆర్థిక అనిశ్చితి వలన రైతుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ము కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితిని నిర్మూలించడానికి కారుచీకట్లో కాంతి పుంజంలా రైతుల పంటలకు సమగ్ర బీమా సౌకర్యం కల్పిస్తూ, ధీమాను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. తక్కువ ప్రీమియంతో.. ఎక్కువ బీమాను చెల్లించే విధంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆధునిక సాంకేతికతో, పంటలకు భీమా కల్పిస్తూ రైతుల భవిష్యత్‌కు భరోసానిస్తూ అమలులోకి తెచ్చింది. కానీ.. వ్యవసాయశాఖ అధికారులు ప్రచారం కల్పించకపోవడం.., భీమా సంస్థలు నిర్లక్ష్యంతో గ్రామాలలో రైతులు భీమా చెల్లించడం లేదు.Body:ఆర్థిక కష్టాల నుంచి కర్షకులను గట్టెక్కించే పంటల బీమా పథకాల గడువు రోజురోజుకు దగ్గరపడుతున్నా.. ఉమ్మడి జిల్లాలో వాటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. ప్రకృతి సహకరించటం లేదని కంటతడి పెడుతున్న అన్నదాతలకు మార్గం చూపేవారు కరవవుతున్నారు. వర్షాలు ఆలస్యంగా రావటంతోనూ.. వచ్చినా కొన్నిచోట్ల సరైన వర్షాలు కురవకపోవటంతో వేల హెక్టార్లలో పంటలను సాగు చేయలేకపోయారు. అక్కడక్కడా పంటలు వేసిన చోటా వర్షాలు లేక ఎండుతున్నాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ప్రధానంగా రైతులకు బీమా ఒక్కటే మార్గం. కాని ఈ బీమా పట్ల ఉమ్మడి జిల్లాలో ఎక్కడా వ్యవసాయశాఖ అధికారులుగాని, బీమా కంపెనీల ప్రతినిధులుగాని ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నారు. కొన్నిచోట్ల బీమా గురించి తెలియని రైతులు ఉన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా కింద ఖరీఫ్‌లో ఆహార పంటలకు రెండు శాతం, వాణిజ్య పంటలకు అయిదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులు ఇప్పటి వరకు ఎక్కడా జరగటం లేదు. కనీసం చెల్లిస్తున్నట్లు వ్యవసాయశాఖ వద్ద సమాచారమే లేదు. ఈ వ్యవహారం మొత్తం బీమా కంపెనీలు మాత్రమే చూసుకోవాలని అంటున్నారు. కనీసం ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఎంతమంది రైతులు పంటల బీమాకు ప్రీమియాన్ని చెల్లించారన్న సమాచారం లేదు. ఉమ్మడి జిల్లాలో లక్షా 20 వేల హెక్టార్లకుపైగా పత్తిని సాగు చేసే రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే మొక్కజొన్న, కంది పంటల్ని కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా పత్తి సాగు చేసిన రైతులు కేవలం 680 రూపాయల ప్రీమియం చెల్లిస్తే పరిహారం కింద రూ.34 వేలు రైతులకు అందే వీలుంది. మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, మిరప వంటి పంటలకు ఉమ్మడి జిల్లాలో బీమా సౌకర్యాన్ని కల్పించారు. వరి తప్ప ఇతర పంటలకు జులై 31 వరకు గడువు ఉంది. Conclusion:జిల్లాలో పంటల బీమా కోసం ఎంపికైన కంపెనీలు బ్యాంకులతో సమన్వయం చేస్తూ బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించేలా చూడాల్సిన అవసరం ఉంది. కాని... ఆ వైపుగా ఎలాంటి చర్యలు చేపట్టం లేదు. ప్రతి ఏడాది చాలా మంది రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు బీమా చెల్లిస్తున్నా.. వాటిని తిరిగి పొందడంలో అవగాహన కొరవడుతోంది. ఈ కారణంగా అన్నదాతలు తాము చెల్లించిన బీమాకు సంబంధించిన డబ్బును నష్టపోతున్నారు. అవగాహన కొరవడుతుండటంతో కొందరు రైతులు తాము చేసుకున్న పంటలకు కాకుండా ఇతర పంటలకు బీమా చెల్లిస్తున్నారు. ఫలితంగా.. పంటలు దెబ్బతిన్న సందర్భాల్లో బీమా అందక నష్టపోతున్నారు. తాము సాగు చేసే పంటలకు కాకుండా ఇతర పంటకు బీమా చెల్లించామని తెలుసుకొని ఘొల్లుమంటున్నారు. ...................Bytes
బైట్స్‌
వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు, మహబూబ్‌నగర్‌

EVO. అధికారులు సమన్వయంతో పథకమును సక్రమంగా అమలు చేస్తేనే.. రైతుల జీవితాలకు ధీమా కల్పించినట్టవుతుంది. ఇప్పటికైన రైతులకు పంట బీమా పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.