మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల్లో భాగంగా కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందన్నారు.
భారత ప్రభుత్వ సత్కరణ హర్షణీయం..
దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు సరళీకృత సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని గట్టెక్కించారని సంజయ్ గుర్తు చేశారు. పీవీని భారత ప్రభుత్వం సముచితరీతిలో సత్కరించడం హర్షణీయమన్నారు. సంస్కరణాధ్యుడిగా పేరుగాంచిన పీవీ తెలంగాణ బిడ్డ కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని కొనియాడారు.