Postal Ballot Application Last Date : ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ సాధించడమే లక్ష్యంగా కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగానే 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల(Disabled People) కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీనికోసం ముందుగా దరఖాస్తు ప్రక్రియలో నమోదు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఈసీ కల్పించిన ఈ హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. అర్హులైన ఓటర్లకు ఇంకా ఒక్కరోజు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంది.
Vote from Home in Telangana Elections 2023 : ప్రక్రియలో భాగంగా బీఎల్ఓల ద్వారా ఫారం 12డీ సమర్పిస్తే వాటిని పరిశీలించి ఇంటి వద్ద నుంచే ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఎవరైనా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకుంటే.. వారికి రవాణా సహా కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు(Special Facilities) కూడా కల్పిస్తారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బందితో పాటు మరో 13 విభాగాలకు చెందిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు.
ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఫుడ్ కార్పోరేషన్, రైల్వే, పీఐబీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్, వైద్య-ఆరోగ్య, ఆర్టీసీ, పౌరసరఫరాలు, బీఎస్ఎన్ఎల్, ఈసీ అనుమతి ఉన్న మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంది. ఆయా శాఖలు, విభాగాల నోడల్ అధికారుల(Nodal Officers) ద్వారా ఫారం 12డీ ఇచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంటుంది. ఇందుకోసం 13 శాఖలకు జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించారు. ఫారం 12డీ సమర్పించేందుకు గడువు బుధవారంతో ముగియనుంది.
పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్
CEC New Rule to Avoid Misuse of Postal Ballots : పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కంటే ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితో పాటు కొత్తగా జోడించిన మరో 13 కేటగిరీలకూ ఈ ఫెసిలిటేషన్ సదుపాయం వర్తిస్తుందని ఈసీ తెలిపింది.
Postal Ballot Facility for Employees : సర్వీసు ఓటర్లుగా పరిగణించే భారత త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఈటీపీబీఎస్‌ను వినియోగిస్తారు. సర్వీసు ఓటర్లు తమకు సంబంధించిన నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను ఈటీపీబీఎస్ పోర్టల్ నుంచి పొందవచ్చు. బ్యాలెట్‌పై తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా బ్యాలెట్‌ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు.
106+ ఏజ్‌లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్‌లో రెడ్ కార్పెట్ వెల్కమ్