ప్రస్తుత విద్యాసంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం నమోదు ప్రక్రియ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈపాస్ వెబ్ సైట్ ద్వారా కళాశాలలు, విద్యార్థుల నమోదు చేసుకోవచ్చు. కొత్త ఉపకార వేతనాలతో పాటు రెన్యువల్ కోసం కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అన్ని సంక్షేమ శాఖలకు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు.
ఇదీ చూడండి: 'జంటనగరాల్లో 150 డివిజన్లలో సంచార చేపల మార్కెట్లు'