రేషన్‌కార్డు ఉన్నవారికి బియ్యం, నిత్యావసరాలతో పాటు నగదునూ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సర్కారు చెప్పినా రేషన్ దుకాణదారులు బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారని హైదరాబాద్ మారేడుపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ కారణంగా మారేడుపల్లిలోని వైఎంసీఏ గుడిసెల నివాసితుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇతర ప్రాంతాల్లో రేషన్‌తో పాటు మిగతా సరుకులు వస్తున్నా తమకు మాత్రం అందించట్లేదని స్థానికులు ఆరోపించారు. స్థానిక నాయకులు వెంటనే స్పందించి అన్నీ అందేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'