ETV Bharat / state

Ponnala: ఏపీతో చీకటి దోస్తానా... చేస్తారా? - Ponnala laxmaiah on irrigation projects

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah)... ముఖ్యమంత్రి కేసీఆర్​ (Cm Kcr)పై విమర్శలు గుప్పించారు. నీటిపారుదల శాఖకు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని ఆరోపించారు.

nnala laxmaiah
పొన్నాల లక్ష్మయ్య
author img

By

Published : Jun 18, 2021, 6:19 PM IST

రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టుల కోసం రూ. 97,300 కోట్లు నీటిపారుదల శాఖ మీద ఖర్చు చేసినా... ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Laxmaiah) ఆరోపించారు. కాళేశ్వరం... కమీషన్ల ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ఆర్డీఎస్ గురించి చాలా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తింటుంటే ఏపీతో చీకటి దోస్తానా... చేస్తారా అని పొన్నాల నిలదీశారు. ఎస్సారెస్పీ నుంచి సాగర్ వరకు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన అన్ని పాత ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలకు నీరు అందుతోందని నీటిపారుదల శాఖ ప్రకటించిందన్నారు. కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులను ప్రారంభించారని వీటికి రూ. 97,300 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లు.. రెండు రోజుల్లో మళ్లీ కిందకు వదలాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.